
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ వరుసదాడులపై శుక్రవారం హోం మినిస్టర్ అమిత్ షా హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశాని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కేంద్ర హోంశాఖ సీపీ అజయ్ కుమార్ భల్లా, జమ్మూ కశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్, బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ చీఫ్ పంకజ్ సింగ్ హాజరయ్యారు. ఉగ్రచొరబాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. కశ్మీర్ లోయలో భద్రతా బలగాలను పెంచాలని ఇప్పటికే కేంద్రానికి సూచించిన అజిత్ దోవల్.. ఉగ్రచొరబాట్లను అరికట్టేందుకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
నెల రోజుల్లో తొమ్మిది మంది హిందువులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. మే 12న బుద్గామ్ లోని పండిట్ రాహుల్ భట్, మే 13న పోలీస్ కానిస్టేబుల్ రియాజ్ ఇంట్లోకి చొరబడి హత్య చేశారు. మే 17న బారాముల్లా మద్యం దుకాణంపై దాడి చేయడంతో సేల్స్ మెన్ రంజిత్ సింగ్ మరణించాడు. మే 25 బుద్గాంలో టీవీ నటి అమ్రిన్ భట్ ను చంపారు. మే 31న కుల్గామ్ లోని గోపాల్ పొరలో హిందూ ఉపాధ్యాయురాలు రజనీ బాలాను హత్య చేశారు. నిన్న రాజస్థాన్ కు చెందిన విజయ్ కుమార్ ను కాల్చి చంపారు. ఇవాళ మరో వలసకూలీని హత్య చేశారు. ఈ ఏడాదిలో మొత్తం 17 మంది హత్యకు గురయ్యారని అధికారులు చెప్పారు.
మరిన్ని వార్తల కోసం...