V ఆకారంలో ఆర్థిక రికవరీ..దేశం ముందు అనేక సవాళ్లు

V ఆకారంలో ఆర్థిక రికవరీ..దేశం ముందు అనేక సవాళ్లు

దేశం ముందు అనేక సవాళ్లున్నాయన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అనురాగ్ ఠాకూర్. బీజేపీ స్టేట్ ఆఫీసులో బడ్జెట్ పై  పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరగింది. ఈ సందర్భంగా మాట్లాడిన అనురాగ్ ఠాకూర్..ఆపదలో కూడా అవకాశాలను వెతుక్కున్నామన్నారు. భారత్ లో కరోనా మరణాలు చాలా తక్కువన్నారు. దేశంలో రెండు వ్యాక్సిన్స్ తయారవుతున్నాయన్నారు. 100  దేశాలకు పైగా వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నామన్నారు . మోడీ హయాంలో భారత్ కరోనాను ఎదుర్కొందన్నారు.

80 కోట్ల మందికి 8 నెలల పాటు ఆహార ధాన్యాలు ఇచ్చామన్నారు. రక్షణ, వ్యవసాయం సహా అనేక రంగాల్లో సంస్కరణలు తెచ్చామన్నారు. ఎంఎస్ఎఈలకు 20శాతం అదనపు వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చామన్నారు. 4 నెలలుగా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటాయన్నారు. V ఆకారంలో ఆర్థిక రికవరీ ఉందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం బడ్జెట్ లో అన్నిచర్యలు తీసుకున్నామన్నారు. హెల్త్ బడ్జెట్ 137 శాతం పెంచామన్నారు. ఇంటింటికీ నల్లా..నల్లాలో స్వచ్ఛమైన నీరందించామన్నారు. జల్ జీవన్ మిషన్ కు రూ.50 వేల కోట్లు కేటాయించామన్నారు.

see more news

యూట్యూబ్ లైవ్‌లో ఛాలెంజ్.. 1.5 లీటర్ వోడ్కా తాగి చనిపోయిన వ్యక్తి

రవిశాస్త్రీకి 120 ఏళ్లా.? గూగుల్ ను ఆటాడుకుంటున్న నెటిజన్లు

ప్లీజ్.. భారతరత్న క్యాంపెయిన్ ఆపేయండి