పెట్రోల్ నో స్టాక్ ..బారులు తీరిన వాహనదారులు

 పెట్రోల్ నో స్టాక్ ..బారులు తీరిన వాహనదారులు

ఆసిఫాబాద్, వెలుగు:  ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంని కొన్ని పెట్రోల్ బంకుల్లో శుక్రవారం నో స్టాక్ బోర్డ్ లు పెట్టడంతో వాహనదారులు బంక్ ల ముందు బారులు తీరారు. జన్కాపూర్ లోని బంక్ లో మాత్రమే పెట్రోల్ ఉండడంతో వాహనదారులు గంటల తరబడి క్యూ కట్టారు.

పెట్రోల్ షార్టేజ్ కావడంతో అత్యవసర పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్యాస్, ఇంధనం కొరత లేదంటూ ప్రభుత్వం చెబుతున్నా ఫీల్డ్ లెవెల్లో మాత్రం వాహనదారులు ఇబ్బందులు పడుతుండటం కనిపిస్తోంది.-