
సామాన్య కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగానంటే బీజేపీనే కారణమన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. కార్యకర్తల కష్టార్జితం వల్లే ఈరోజు తనకు కేంద్రమంత్రి పదవి వచ్చిందన్నారు.
152 రోజులు కుటుంబానికి దూరమై ప్రజా సంగ్రామయాత్రతో తన వెంట ఉన్నారని చెప్పారు. ఈ బాధ్యత కరీంనగర్ ప్రజలు పెట్టిన బిక్ష అని అన్నారు. తన పదవి, హోదా కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని చెప్పారు.
కమిట్ మెంట్ తో పని చేసే కార్యకర్తలు ఉన్నారు కాబట్టే కేంద్రం తనను గుర్తించిందన్నారు. కేంద్రమంత్రిగా కరీంనగర్ అభివృద్ధికి పాటుపడుతానని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అందరిని కలుపుకుని అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం బండి సంజయ్ కరీంనగర్ కు వచ్చారు. కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.