గణేశ్ మండపాలకు అయ్యే కరెంటు ఖర్చంతా తానే చెల్లిస్తానన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. విద్యుత్ శాఖ అధికారులు మండప నిర్వాహకులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు బండి సంజయ్.
ఈ సందర్బంగా మాట్లాడిన బండి సంజయ్.. గణేశ్ మండప నిర్వాకులు నవరాత్రి దీక్షలు చేపట్టాలని సూచించారు. భక్తిశ్రద్దలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. దీనికి తానే ఉదాహరణ ... 30 ఏళ్లుగా నిత్యం భగవంతుడిని పూజిస్తున్నానని చెప్పారు. నిమజ్జనం రోజే కాకుండా 9 రోజులపాటు కనీస సౌకర్యాలు ఆదేశించారు. హెల్త్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక అంబులెన్స్ లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకుందామని చెప్పారు. కరీంనగర్ ను ఆదర్శంగా నిలుపుదామన్నారు బండి సంజయ్.