
త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయమన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. కేసీఆర్ కు ఏఐసీసీ, కేటీఆర్ కు పీసీసీ చీఫ్..కవితకు రాజ్యసభ సీటు ఇస్తారన్నారు.
కవిత బెయిల్ కు బీజేపీతో ఏం సంబంధమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసుకుంటే బెయిల్ వస్తుందనడం మూర్ఖత్వమన్నారు. ఆప్ ను విలీనం చేస్తేనే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్ లను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు బండి సంజయ్.
బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.విలీనం తర్వాత కేసీఆర్ గవర్నర్.. కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్ అవుతారు. కవితకు బెయిల్ వస్తుంది..హరీశ్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గా బండి సంజయ్ కాంగ్రెస్ లోనే బీఆర్ఎస్ ను విలీనం చేస్తారని చెప్పారు.