జాతీయవాద దృక్పథంతోనే ఆర్టికల్ 370 రద్దు

జాతీయవాద దృక్పథంతోనే ఆర్టికల్ 370 రద్దు

న్యూఢిల్లీ: జాతీయవాద దృక్పథంతో బీజేపీ రాజకీయాలు ప్రారంభించిందని, అందులో భాగంగానే ఆర్టికల్ 370ని తొలగించామని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. అగ్నిపథ్ వివాదంపై మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ... అగ్నిపథ్ స్కీంపై ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయన్నారు, బీజేపీ రూపొందించే ఏ పథకమైనా భూమి ఆకాశం ఉన్నంత వరకు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. జీఎస్టీ గొప్ప విజయం సాధించిందన్న  ఆయన... ఈ కొత్త ట్యాక్స్ విధానాన్ని ప్రజలు స్వాగతించారన్నారు. గవర్నెన్స్ ను కింది స్థాయి వరకు చేర్చి, సంక్షేమ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లు దేశంలో ఒకే పార్టీ కింద నలిగిపోయిందని, బీజేపీ ప్రభుత్వం వచ్చాకా ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి చెప్పారు. దేశంలో ప్రజా స్వామ్య పరిరక్షణకు బీజేపీ ముందు నుంచి పోరాడుతోందని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తిలేదని తేల్చి చెప్పారు.