హర్ ఘర్‌ తిరంగా బైక్‌ ర్యాలీని ప్రారంభించిన కిషన్ రెడ్డి

హర్ ఘర్‌ తిరంగా బైక్‌ ర్యాలీని ప్రారంభించిన కిషన్ రెడ్డి

దేశ రాజధాని ఢిల్లీలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా అందరూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపినిచ్చింది. అందులో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో పలువురు ప్రముఖులతో పాటు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... హర్ ఘర్ తిరంగా అనేది రాజకీయాలకు, ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదని.... ఇది దేశంలోని 130 కోట్ల దేశ ప్రజలకు తిరంగపై ఉన్న దేశభక్తిని చాటే విషయానికి సంబంధించినదన్నారు. అంతే కాకుండా.. ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రతిపక్షనేతలెవరూ స్టేట్ మెంట్స్ చేయకూడదని కోరారు. ఆగష్టు 15న అందరూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో పాల్గొనాలని కిషన్ రెడ్డి చెప్పారు.