అగ్నిపథ్ను రాజకీయ కోణంలో చూడొద్దు

అగ్నిపథ్ను రాజకీయ కోణంలో చూడొద్దు

అగ్నిపథ్ పథకంపై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీనివల్ల ఎవరికీ నష్టం జరగదని.. చాలా దేశాల్లో ఇలాంటి పథకాలున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మంచి కోసం ఈ పథకాన్ని తెచ్చామని..దీనిని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. 4ఏళ్లు  దేశసేవ చేయడానికి యువతకు ఈ అవకాశం ఇస్తున్నామని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అగ్ని వీరులకు మహేంద్ర లాంటి కంపెనీ లు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు చెప్పారు.

ఆరోగ్యం గా ఉండాలంటే యోగ  చేయాలని కిషన్ రెడ్డి అన్నారు. రేపటి యోగ అద్భుత మహోత్సవ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఇ క ప్రధాని మోడీ కర్ణాటక, మైసూర్ లో నిర్వహించే యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. 200 దేశాల్లో యోగ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్న ఆయన..100 రోజుల నుంచి యోగ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో 75  కేంద్రాల్లో యోగ దినోత్సవాలు  జరుగుతున్నట్లు చెప్పారు. 24 గంటల పాటు దేశవ్యాపంగా యోగ దినోత్సవ వేడుకలు జరుగుతాయని..గిన్నిస్ బుక్ రికార్డ్ లో యోగ దినోత్సవం మరో సారి చేరబోతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మెడికల్ ఖర్చులు తగించుకోవాలంటే యోగ తప్పనిసరిగా చేయాలని తెలిపారు.