కేసీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

కేసీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

సర్జికల్ స్ట్రైక్స్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత సాయుధ బలగాలపై తెలంగాణ సీఎం చేసిన బాధ్యతారహిత ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పుల్వామా ఉగ్రదాడి జరిగి వార్షికోత్సవం సందర్భంగా సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనాలోచితం, బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం, అజ్ఞానమని ధ్వజమెత్తారు కిషన్‌రెడ్డి. 

ప్రెస్‌మీట్ పెట్టిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌పై నిర్వహించినట్లుగా చెబుతోన్న సర్జికల్ స్ట్రైక్స్‌పై అనుమానాలను లేవనెత్తారు. దేశ సరిహద్దులకు అవతల, పాకిస్తాన్ భూ భాగంపై బాలాకోట వద్ద గల జైషె మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం నిర్వహించిన దాడులు కాకుండా- సర్జికల్ స్ట్రైక్స్ గురించి కేసీఆర్ ప్రశ్నించారు. దీనికి గల సాక్ష్యాధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 2016లో జమ్మూ కాశ్మీర్‌లోని యూరి సెక్టార్ వద్ద ఈ సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి: 

యూపీలో 300 సీట్లు గెలుస్తాం