
న్యూఢిల్లీ, వెలుగు: ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఈజ్ మేడ్ ఇన్ చైనా’ అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఎంవోయూ కుదుర్చుకున్న పార్టీ నేతల నుంచి ఇలాంటి కామెంట్స్ రావడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఎనిమిదేండ్ల కింద కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ‘సమతామూర్తి విగ్రహ’ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఈ విగ్రహ ఏర్పాటుకు కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదని, ప్రైవేటు ధార్మిక సంస్థ నిధులు సమకూర్చు కుందని వివరించారు. ‘‘అవాస్తవాలతో తను మునగడంతో పాటు, కాంగ్రెస్ పార్టీని మట్టిలో కలుపుతున్నారు. ఇలాంటి ట్వీట్లతో రాహుల్ తన అజ్ఞానాన్ని, డొల్లతనాన్ని బయటపెట్టుకు న్నారు” అని కిషన్‌రెడ్డి విమర్శించారు.