తెలంగాణలో రోడ్ల అభివృద్ది వేగంగా జరుగుతుంది

తెలంగాణలో రోడ్ల అభివృద్ది వేగంగా జరుగుతుంది

తెలంగాణలో రోడ్ల అభివృద్ది వేగంగా జరుగుతుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. 274 కి.మీ. మేర రోడ్డు పనులు రూ. 7040 కోట్లతో జరుగుతున్నాయన్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో పనులపై సమీక్షలు జరుపుతున్నానని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సర్కార్ తరుపున భూసేకరణ పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. అవి కూడా స్పీడ్ ఐతే.. పనుల్లో  వేగం పెరుగుతుందన్నారు. మరో 336 కి.మీ. మేర పనులు రూ. 8500 కోట్లతో చేపట్టేందుకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని కేంద్రమత్రి తెలిపారు. 2022 లో టెండర్ కావాల్సిన 860 కి.మి. పనులకే కేంద్రం ఖర్చు చేయబోతుందన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేయబోతున్నామన్నారు. 

ప్రధాని మోడీ వచ్చాక నేషనల్ హైవేలు అభివృద్ది చెందుతున్నాయన్నారు. తెలంగాణ ముఖ చిత్రం నేషనల్ హైవేతో కిషన్ రెడ్డి మారిందన్నారు. అదేవిధంగా RRR తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా వుంటుందన్నారు. గేమ్ చెంజర్ గా RRRమారబోతోందన్నారు. అనేక నూతన నగరాలు, కాలనీలు పెరగనున్నాయన్నారు కిషన్ రెడ్డి. అనేక జిల్లాల్లో RRRకు అనుసంధానం కానుందన్నారు.పరిశ్రమలు, ఐటి డెవలప్ మెంట్ అవుతున్నాయన్నారు. హౌసింగ్ అనేది మధ్య తరగతి ప్రజలకు వీలుగా వుంటుందన్నారు. తెలంగాణలో టూరిజం కూడా పెరుగుతుందన్నారు కేంద్రమంత్రి. 

ఇవి కూడా చదవండి:

బీజేపీ ప్రభుత్వం పేదవారికి అన్నం పెట్టలేకపోతోంది

బీజేపీ ఓబీసీ మోర్చా సెక్రెటరీ, ఎస్‌డీపీఐ నేతల హత్య