అగస్ట్ 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

అగస్ట్ 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

ప్రపంచానికి విశ్వగురు స్థానంలోకి భారత్ ను తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను ఆయన సన్మానించారు. త్రివర్ణ పతాకాన్ని రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య స్ఫూర్తిని ప్రజల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. గతేడాది నుంచి అజాది కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఆయన..త్యాగపురుషుల కలలను సఫలీకృతం చెయ్యడానికి అందరు కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

అగస్ట్ 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని కిషన్ రెడ్డి అన్నారు. 100 ఏళ్ల స్వాతంత నాటికి పేదరికం లేని భారత్ ను తయారుచేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పింగళి వెంకయ్య స్వగ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. కాగా ‘‘జాతీయ జెండా నిర్మాతగా పింగళి వెంకయ్యను గతంలో ఎవరు పట్టించుకోలేదు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఆయన్ని ప్రత్యేకంగా గుర్తించింది. తమను సత్కరించడం సంతోషంగా ఉంది ’’ అని పింగళి వెంకయ్య కుటుంబసభ్యులు తెలిపారు.