దళితబంధు క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంతా ఈటలకే

దళితబంధు క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంతా ఈటలకే
  • హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్యే పోటీ: కిషన్‌‌‌‌ రెడ్డి 

హుజూరాబాద్ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకం క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంతా ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, హుజూరాబాద్ ప్రజలకు, బీజేపీకే దక్కుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ‘హుజూరాబాద్ ఈటల రాజేందర్ దళితబంధు పథకం’ అని పేరు పెడితేనే సార్థకత ఏర్పడుతుందన్నారు. హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ వేసిన తర్వాత స్థానిక మధువని గార్డెన్స్ లో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘హుజూరాబాద్ లో ధర్మానికి – అధర్మానికి, ప్రజాస్వామ్యానికి – నియంతృత్వానికి, నీతికి -అవినీతికి, నిజాయతీకి - నియంతకు, మంచికి -చెడుకి మధ్య పోటీ జరుగుతోంది. ఇంతగా అధికార దుర్వినియోగానికి, దుర్మార్గానికి పాల్పడిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. తాను, తన కుటుంబమే ఉండాలని, తమను ఎవరూ ప్రశ్నించకూడదనేది కేసీఆర్ మనస్తత్వం. అందుకే ఆయనను ప్రశ్నించిన ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్నిరకాల అడ్డదారులు తొక్కుతోంది” అని ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ప్రతిష్ట తెచ్చేలా హుజూరాబాద్ ఓటు ఉండాలని ఆయన కోరారు.
హుజూరాబాద్ ప్రజలే దారి చూపుతరు
నీతి, నిజాయతీ, ఆత్మాభిమానంతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి ఈటల రాజేందర్ అని కిషన్​రెడ్డి కొనియాడారు. ఈటల ఎవరికీ హాని చేయలేదని, కేసీఆర్ కుటుంబ పెత్తనాన్ని నిలదీసిన వ్యక్తి అని అన్నారు. ఈటల రాజీనామాతో కేసీఆర్ కుటుంబ పీఠాలు కదులుతున్నాయన్నారు. కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు తెలంగాణ ప్రజలకు దారి చూపేది హుజూరాబాద్ ప్రజలేనని చెప్పారు. గతంలో దుబ్బాక, హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎలా బుద్ధి చెప్పారో చూశామని, హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ అలానే బుద్ధి చెప్పాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
అబద్ధాలు మాట్లాడుతున్న సీఎం
మూడు ఎకరాలు ఇస్తానని శాసనసభలో ప్రకటించిన సీఎం కేసీఆర్.. ‘నేను అనలే’దని అదే అసెంబ్లీలో అబద్ధమాడారని కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డల్లాస్ చేస్తానని గతంలో కేసీఆరే చెప్పారని, ఇప్పుడు అది కూడా అనలేదంటున్నారని మండిపడ్డారు. మాట తప్పడం, మడమ తిప్పడం కేసీఆర్ నైజం అన్నారు. మూడున్నర కోట్ల ప్రజల భవిష్యత్ ను తీర్చిదిద్దే ఎన్నిక ఇది అని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రావడం ఖాయమన్నారు.
అందరూ హూజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రండి: ఈటల
హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్​కు కర్రుకాల్చి వాత పెడుతారని ఈటల రాజేందర్ అన్నారు. ప్రజల అభిప్రాయాలను ఎన్నికలప్పుడు బయటికి చెప్పరని, కానీ ఏ పార్టీకి ఓటేస్తామో ఓటరు బయటికి చెప్పింది హుజూరాబాద్ ఎన్నికలోనేనని పేర్కొన్నారు. దేశంలోని సర్వే సంస్థలు ఇక్కడి ప్రజాభిప్రాయం చూసి నివ్వెరపోతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి కేసీఆర్ దిమ్మతిరిగేలా, చెంప చెళ్లుమనిపించేలా ఓటర్లు తీర్పు ఇస్తారన్నారు. తనతో పని చేసిన ఉద్యమ సహచరులు, ప్రజాస్వామ్యవాదులు, కేసీఆర్ నిర్ణయాలతో భంగపడ్డ వారు అందరూ హుజూరాబాద్ కు రావాలని ఈటల కోరారు. మాజీ ఎంపీ, హుజూరాబాద్ ఎన్నికల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి జితేందర్ రెడ్డి, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు పాల్గొన్నారు.