
అగ్నిపథ్ స్కీమ్ యువతకు ఎంతో మేలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీనిపై అపోహలు వద్దని ఆయన సూచించారు. అగ్నిపథ్‌పై పలు రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేయడం సరైంది కాదన్నారు. ‘‘కొంతమంది ఆందోళన చేస్తున్నారు.. విమర్శిస్తున్నారు.. అయితే అన్ని వర్గాల ప్రజలకు, వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు నా విజ్ఞప్తి... కేంద్ర ప్రభుత్వం ఒక పవిత్రమైన మనసుతో, దేశ భద్రత కోసం, భద్రతా దళాలు శక్తిమంతంగా ఉండటం కోసం, దేశంలోని యువతకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే అగ్నిపథ్ స్కీమ్‌ను తెచ్చింది. 1999 నుంచే దీని గురించి అలోచన చేస్తున్నరు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దీనికి బీజం పడింది. దీన్ని రాజకీయ దృక్ఫథంతో చూడొద్దు. అమాయకులైన యువతను రెచ్చగొట్టి వారి జీవితాలను నాశనం చేయొద్దు” అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.