
వచ్చే నాలుగేళ్లలో దేశంలో 100 ఎయిర్ పోర్ట్స్ నిర్మిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2014 వరకు దేశంలో 64 ఎయిర్ పోర్ట్స్ ఉండగా మోడీ ప్రభుత్వం వచ్చాక 118కి చేరాయన్నారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ లో జరిగిన ప్రవాస 3.0 సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్ రవాణా వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని.. దేశవ్యాప్తంగా అద్భుతమైన హైవేలను నిర్మించామని తెలిపారు. దేశ్యాప్తంగా 90 వేల నేషనల్ హైవేలను నిర్మించామని..70 వేల కొత్త రోడ్ల కనెక్టివిటీ కొనసాగుతోందన్నారు. పటిష్టమైన ప్రణాళికతో రోడ్లను నిర్మిచడం వల్లే దేశంలో ప్రమాదాలు తగ్గాయన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ అభివృద్ధికి కృషి చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. 370 ఆర్టికల్ తీసుకొచ్చాక జమ్మూ కశ్మీర్ లో రికార్డ్ స్థాయిలో టూరిస్ట్ల విజిటింగ్ పెరిగిందన్న ఆయన.. కేధార్నాథ్ కు వచ్చే టూరిస్టులు కూడా పెరుగుతున్నట్లు చెప్పారు. ఇక ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ఇండస్ట్రీ సమస్యలపై కేంద్రమంత్రులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. టూరిజం శాఖలో రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు పెంచుతామని చెప్పారు. టూరిజం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు.