మోడీ మేక్ ఇన్ ఇండియా అంటే కేసీఆర్ జోక్ ఇన్ ఇండియా అంటున్నడు: కిషన్ రెడ్డి

మోడీ మేక్ ఇన్ ఇండియా అంటే కేసీఆర్ జోక్ ఇన్ ఇండియా అంటున్నడు: కిషన్ రెడ్డి

ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియా అంటే సీఎం కేసీఆర్ జోక్ ఇన్ ఇండియా అంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అవహేళన చేయకుండా ప్రోత్సహిస్తే బాగుంటుందని హితవు పలికారాయన. మార్చి 19న ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించినందుకు టీచర్లకు ధన్యవాదాలు తెలపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజాస్వామ్య పరిరక్షణకు కోసం కృషి చేస్తున్న బీజేపీని ఆదరిస్తున్నారనే దానికి ఇదే నిదర్శనం అన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీతో మార్పు వస్తుందని భావించారనే దానికి ఈ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో మార్పు తీసుకొస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా టెక్ట్స్ టైల్ రంగాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు పీఎం మిత్ర ద్వారా తెలంగాణకు మెగా టెక్ట్స్ టైల్ పార్కును కేటాయించారు ప్రధాని మోడీ. ప్రధాని ప్రత్యేకమైన విజన్ తో తయారీ సంస్థలను నెలకొల్పుతున్నారని చెప్పారు.5f విజన్ తో తెలంగాణలో టెక్స్ట్ టైల్ పార్కు ఏర్పాటు కానుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ పథకం కింద రూ.4445కోట్లు కేటాయించారు. ఒక్కో టెక్ట్స్ టైల్ పార్కుకు కనీసం వెయ్యి ఎకరాల స్థలం అవసరం అవుతుందన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ కు లేఖ రాశామని వ్యాఖ్యానించారు కిషన్ రెడ్డి. అంతర్జాతీయ సంస్థల ద్వారా విదేశీ పెట్టుబడులను కూడా అహ్వానిస్తామన్నారాయన. దీంతో లక్ష మందికి నేరుగా.. పరోక్షంగా రెండు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. భారత్ దేశం వివిధ దేశాలతో టెక్స్ట్ టైల్ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

తాము మేక్ ఇన్ ఇండియా అంటే కేసీఆర్ జోకిన్ ఇండియా అంటున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవ చేశారు. మోడీ మేక్ ఇన్ ఇండియా తీసుకోవాలి తప్పితే.. కల్వకుంట్ల జోకిన్ ఇండియా కింద తీసుకోవద్దని ప్రజలకు సూచించారు. వరంగల్ లో టెక్స్ట్ టైల్ పార్కు పెట్టాలనేది తన వ్యక్తిగత అభిప్రాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్ల ఎగుమతిలో చైనా తరువాత మనమే అగ్రభాగాన ఉన్నామని తెలిపారు. 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను పునర్ నిర్మించనున్నాం.. వచ్చే నెలలో ప్రధాన మంత్రి నూతన భవనాలకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు కిషన్ రెడ్డి. వందే భారత్ రైళ్లను కేసీఆర్ పరిహాసం చేస్తున్నారు.. కేసీఆర్ పరిహాసం చేసేది ప్రధానిని కాదు.. కార్మికులను అని అన్నారు. త్వరలో హైదరాబాద్ నుంచి తిరుపతికి మరొక వందే భారత్ రైలును ప్రారంభించుకోబోతున్నామన్నారు. ఎంఎంటిఎస్ సెకండ్ ఫేస్ ఘట్కేసర్ నుంచి యాదాద్రి ఎంఎంటిఎస్ కోసం ఎన్ని సార్లు అడిగినా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు కిషన్ రెడ్డి.

సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటనలో చనిపోయిన ఆరుగురి మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయం కింద రెండు లక్షలు అందివ్వాలని సూచించానని తెలిపారు కిషన్ రెడ్డి. మంచి జరిగితే తండ్రి కొడుకులు (కేసీఆర్,కేటీఆర్) తీసుకుంటున్నారు..కానీ చెడు జరిగితే మాత్రం బీజేపీ కుట్ర అంటున్నారని విమర్శించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీతో బీజేపీకి ఏమిటి సంబందం అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అబద్దాల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతుంది కల్వకుంట్ల కుటుంబమని మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వ పెద్దలు అక్రమాలకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలతో కేంద్రం సీబీఐని విచారణకు ఆదేశించిందని.. దీంతో తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్కక్కొరుగా బయటకు వచ్చారని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం మద్యం వ్యాపారం చేస్తే తమకొచ్చే నష్టమేమీ లేదని.. కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు కిషన్ రెడ్డి. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ సందర్భంగా కొంపలు మునిగిపోయినట్లు మంత్రివర్గమంతా ఢిల్లీకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పారు. మద్యం కేసును  తప్పుదారి పట్టించడానికి ఇదంతా.. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు కలసి ఉన్నారు. కాబట్టే రాష్ట్రంలో జరుగుతున్న ఎలాంటి విషయాలపైన స్పందించడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ తొలి మంత్రివర్గంలో ఒక మహిళనైనా తీసుకున్నారా అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి.. ముందు మహిళలకు 33 శాతం అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.