
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్–తిరుపతి మధ్య నడుస్తున్న వందే భారత్ ట్రైన్ కోచ్ ల సంఖ్యను డబుల్ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ట్విట్టర్ లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ రైలులో ప్రస్తుతం కోచ్ల సంఖ్య ఎనిమిది ఉండగా వాటిని 16 కు పెంచాలని ప్రధాని మోడీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లను కోరగా అంగీకరించారని ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని, రైల్వే మంత్రికి ధన్యవాదాలు చెప్పారు. తిరుపతి వెళ్లే భక్తులకు ఇది ఎంతో ఉపయోగమని ఆయన వెల్లడించారు. గత నెల 9న ప్రారంభించిన ఈ ట్రైన్ ఫుల్రష్ తో నడుస్తున్నది. కోచ్ లు పెంచాలని ప్యాసింజర్ల నుంచి డిమాండ్ వచ్చిన నేపథ్యంలో కిషన్ రెడ్డి ప్రధాని, రైల్వే మంత్రి దృష్టికి విషయం తీసుకెళ్లారు.