
TRS ప్రభుత్వంపై ట్విట్టర్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వాల్సిన రాష్ట్రవాటా నిధులు ఇవ్వకపోవడంతో.. రైల్వే ప్రాజెక్టులు నెమ్మదిగా కొనసాగుతున్నాయన్నారు. రైల్వేల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కూడా సేకరించి ఇవ్వడం లేదన్నారు. భూసేకరణలో తగాదాల పరిష్కారానికి కేసీఆర్ ప్రభుత్వం చొరవ చూపకపోవడం లేదన్నారు కిషన్ రెడ్డి. దీంతో తెలంగాణలో 13వందల కిలో మీటర్లకుపైగా రైల్వే పనులు ఆలస్యంగా నడుస్తున్నాయన్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ ఇకనైనా ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇస్తారా అని ప్రశ్నించారు. భూమి సేకరించి ఇవ్వడంతో పాటు.. భూతగాదాల పరిష్కారంలో చొరవ చూపుతారా అంటూ ట్విట్టర్ లో నిలదీశారు కిషన్ రెడ్డి. TRS ప్రభుత్వం త్వరగా తేల్చుకోకపోతే, తెలంగాణ ప్రజలు త్వరలో మీతో తేల్చుకుంటారు జాగ్రత్త అంటూ ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి.