సెవెన్ టూంబ్స్కు స్వదేశీ దర్శన్ స్కీమ్ నిధులు

సెవెన్ టూంబ్స్కు స్వదేశీ దర్శన్ స్కీమ్ నిధులు

హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన షేక్ పేట్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘నగర వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. ఇక్కడికి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా వచ్చి జీవనం కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అందరం కృషి చెయ్యాలి. గడిచిన 75 సంవత్సరాలలో ఎన్నో జాతీయ రహదారులు నిర్మించారు. అయితే గత ఏడు సంవత్సరాలలో అంతకన్నా ఎక్కువ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. కేంద్ర ప్రభుత్వం.. హైదరాబాద్ నగర అభివృద్ధికి కట్టుబడి ఉంది. హైదరాబాద్ నగరంలో సైన్స్ సిటీ ఏర్పాటు చేయాలి. అందుకోసం 25 ఎకరాల భూమి అవసరం. అదేవిధంగా సెవెన్ టొంబ్స్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ద్వారా స్వదేశీ దర్శన్ పథకంలో నిధులు మంజూరు చేస్తాం. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. దానికి సంబంధించిన భూమి త్వరగా సేకరిస్తే తొందరగా అందుబాటులోకి వస్తుంది’ అని కిషన్ రెడ్డి అన్నారు.

For More News..

పది మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా

పళ్లతో కారును లాగేసిన పులి