ప్రజాస్వామ్యయుత చర్చల వేదిక పార్లమెంటు

ప్రజాస్వామ్యయుత చర్చల వేదిక పార్లమెంటు

కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ సర్కారు విష ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం అగ్రిమెంట్ ప్రకారం రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు.  రైతుల దగ్గర ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఈవిషయం తెలిసినా.. టీఆర్ఎస్ ప్రభుత్వం దురుద్దేశంతో  రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది సంవత్సరాల తర్వాత కేసీఆర్ కు కేంద్ర సర్కార్ గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ తొండి ఆటకు దిగిందని కిషన్ రెడ్డి తెలిపారు.  ప్రజాస్వామ్యం గురించి కేసీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కుటుంబ పెత్తనం కొనసాగుతోందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. పార్లమెంటులో ప్రజాస్వామ్యయుతంగా  ఏ చర్చ అయినా చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు.