త్వరలోనే 12 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్

V6 Velugu Posted on Aug 30, 2021

ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశంలో జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటి వరకు 60 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని చెప్పారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు కిషన్ రెడ్డి. త్వరలోనే 12 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందన్నారు. టీకాలపై వదంతులు నమ్మొద్దని చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పండగలు జరుపుకోవాలని సూచించారు. 
 

Tagged Vaccination, union minister kishan reddy, visit, 12 years, Ujjaini Mahankali Temple

Latest Videos

Subscribe Now

More News