కేంద్ర బడ్జెట్ మేధావులు మెచ్చిన బడ్జెట్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర బడ్జెట్  మేధావులు మెచ్చిన బడ్జెట్:  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అన్ని రకాల వర్గాల వారికి మేలు జరిగేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.  ప్రజల ఆకాంక్షలకు రెక్కలొచ్చేటట్టు బడ్జెట్ ఉందన్నారు. బడ్జెట్ ను రాష్ట్రాల వారీగా చూడొద్దన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో జరిగే పనులకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. బడ్జెట్ అనగానే ప్రజల్లో ఉచితాలు అనే అభిప్రాయం ఉందన్నారు. కేంద్ర బడ్జెట్ పై మేధావులు ప్రశంసలు కురిపిస్తున్నారని అన్నారు కిషన్ రెడ్డి. 

 ఎన్నికల కోసం కాకుండా వికసిత్ భారత్ కోసం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్నారు. పీఎం ఆవాస్ కింద రాష్ట్రానికి 4.30 లక్షల ఇళ్లు కేటాయించారని తెలిపారు. జాతీయ రహాదారుల నిర్మాణంలో తెలంగాణకు బడ్జెట్ లో పెద్దపీట వేసిందని చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2026 బడ్జెట్ లో తెలంగాణపై కేంద్ర వివక్ష చూపెట్టింది. హైస్పీడ్ రైళ్లు మినహా కేంద్రం నయా పైస కేటాయించలేదు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కేంద్రం బడ్జెట్ లో రూపాయి కేటాయించకపోవడంపై అధికార పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే  కేంద్రమంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి బడ్జెట్ పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.