
న్యూఢిల్లీ: భారత్ లో టెక్స్ టైల్ హెరిటేజ్ ని ఎల్లప్పుడూ జరుపుకొంటున్నామని, ఆ హెరిటేజ్ ను కాపాడుకోవాలనే కాన్సెప్ట్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామితో కలిసి మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సూత్ర్ సంతతి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఏర్పాటు చేసిన సూత్ర్ సంతతి ఎగ్జిబిషన్ ను లీడర్లు సందర్శించారు. మ్యూజియంలో ప్రముఖ టెక్స్ టైల్ రివైనలిస్ట్ లవినా బల్డోటా స్పెషల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దెన్, నౌ, నెక్ట్స్ క్యాప్షన్ తో సూత్ర్ సంతతి ఎగ్జిబిషన్ పెట్టారు లవినా.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను మంత్రి అభినందించారు. ఎగ్జిబిషన్ లో వందకు పైగా టెక్స్ టైల్స్ పార్టిసిపేట్ చేశాయని లవినా తెలిపారు.