దళిత బంధు పథకం ఫెయిల్

దళిత బంధు పథకం ఫెయిల్

తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని ఎన్నో కష్టాలతో సాధించుకున్నారని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆయన హుజూరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మహేంద్రనాథ్ పాండే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సంపర్క అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా నాకు హుజూరాబాద్ నియోజకవర్గం ఇంచార్జీగా నియమించారు అన్నారు. రాష్ట్ర సాధనలో బీజేపీ పార్టీ పాత్ర కూడా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్ళు, నిధులు, నియామకాల కోసం.. కానీ రాష్ట్ర వచ్చాక అనుకున్నది ఇక్కడ జరగటం లేదని విమర్శించారు.

ఇక్కడ కట్టిన ప్రాజెక్ట్ లు అన్ని కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంలుగా మారాయన్నారు. మోడీ అధికారం లోనికి వచ్చినప్పటి నుండి రైతుల కోసం సమ్మాన్ నిధి, బాలికల కోసం సుకన్య సమృద్ధి పథకాలతో 3 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మహేంద్ర నాథ్ పాండే తెలిపారు. కరోనా పాండమిక్ సమయంలో అందరూ ఇండియాలో ఏమి జరుగుతుందోనని భయపడ్డారు. కానీ మనమే వాక్సిన్ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేశామని పేర్కొన్నారు. మన ప్రజలకు టీకా ఇచ్చిన తర్వాతే విదేశాలకు ఎగుమతి చేశామని వ్యాఖ్యానించారు.

భారత దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రధాన మంత్రి జన్ దన్ పథకం కింద బ్యాంక్ ఖాతా ఓపెన్ చేశారు. సోషల్ వెల్ఫేర్ స్కీం సెంట్రల్ గవర్నమెంట్ వారు పక్కగా అమలు చేస్తున్నారు ధీమా వ్యాక్తం చేశారు. తెలంగాణ మొత్తం అవినీతితో నిండి ఉందన్నారు. తెలంగాణలో 3935 వెల్ నెస్ సెంటర్ లు మాత్రమే ఉన్నాయి. ఇవి 4 కోట్ల మందికి సరిపోతాయా? అని మహేంద్రనాథ్ పాండే ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం ఫెయిల్ అయిందని ఆయన విమర్శలు చేశారు. దాంతో పాటు రైతు బంధు పథకం కూడా ఫెయిల్ అయిందన్నారు. ఇక్కడ అమలు చేసే పథకాల్లో టీఆర్ఎస్ లీడర్లు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు మహేంద్రనాథ్ పాండే.

ఇక్కడ ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు. ప్రభుత్వ వచ్చినపుడు ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు. 18 రాష్ట్రాల్లో మా ప్రభుత్వం ఉన్నది అందరూ ప్రతినిధులు నేరుగా సచివాలయానికి వెళ్తారు.. కానీ తెలంగాణలో కేసీఆర్ కి అహంకారం ఎక్కువగా ఉన్నది. ఎవరు కూడా నేరుగా కలిసే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు గౌరవ మర్యాదలు కలిగి ఉన్న వారు. ఇక్కడ మోడీ ఆధ్వర్యంలో బీజేపీనీ అధికారంలోకి తేవాలన్నారు. మోడీ గొప్ప పాపులారిటీ ఉన్న వ్యక్తి. అన్ని రంగాల వారి మద్దతు తీసుకొని అధికారం లోకి తేవాలని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే కోరారు.