
అమరజవాన్ల త్యాగం మరువలేనిదన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ చంద్రాయణగుట్టలోని CRPF హెడ్ క్వార్టర్లో జరిగిన అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పుల్వామ ఘటనలో వీరమరణం పొందిన 41 మంది సిబ్బందికి నివాళులు అర్పించి…వారికి గుర్తుగా 41 మొక్కలు నాటారు. ఈ వేడుకల్లో CRPF అధికారులు, సిబ్బంది పాల్గొని కిషన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు.