రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం పక్కా

రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం పక్కా

మంచిర్యాల జిల్లా: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో  సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కేంద్ర  కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి మండిపడ్డారు.  జిల్లా కేంద్రంలో టీఎన్జీవో హాల్ లో ఏర్పాటు చేసిన మంచిర్యాల అసెంబ్లీ మోర్చ కమిటీల సమావేశంలో  కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో కుటుంబ పాలనతో పాటు అవినీతి రాజ్యమేలుతుందన్నారు. ఎనిమిదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రజలకు చేసిందేమీలేదని మండిపడ్డారు. మోడీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. కేంద్రం ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ... కేసీఆర్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలేదని ఆరోపించారు. అందు వల్లనే రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిందన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.