టీఆర్ఎస్ పక్కా కుటుంబ పార్టీ 

టీఆర్ఎస్ పక్కా కుటుంబ పార్టీ 

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ విమర్శించారు. పార్లమెంట్ ప్రవాసీ యోజనలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఆయన.. కేంద్ర పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రహ్లాద్ జోషి కేసీఆర్ పాలన వైఫల్యాలను ఎండగట్టారు. టీఆర్ఎస్ పక్కా కుటుంబ పార్టీ అని ఆరోపించారు. 8 ఏండ్లలో తన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలిచ్చుకున్నారని విమర్శించారు. మానిఫెస్టోలో చెప్పిన నిరుద్యోగ భృతి సంగతి ఏమైందని ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. 

సీఎం కేసీఆర్ పీఎంఏవై నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలని అన్నారు. ఏండ్లు గడుస్తున్నా ఓల్డ్ సిటీలో మెట్రో పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయడంలేదని మండిపడ్డ కేంద్ర మంత్రి కనీసం పంట నష్టంపై సర్వేలు, పంటల బీమా కూడా అమలు చేయడం లేదని వాపోయారు.

అంతకు ముందు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులతో కేంద్రమంత్రి సమావేశమయ్యారు. పార్టీని పటిష్ఠం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.