జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాలి: కేంద్రమంత్రి

జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాలి: కేంద్రమంత్రి

జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. లక్డీకపూల్ లో జరిగిన  బీసీ సంఘాలు-బీసీ కుల సంఘాల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేశ జనాభాలో 52 శాతం ఉన్న బీసీల కుల గణన జరగాలన్నారు. బీసీ జనగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు, బీసీ మంత్రిత్వశాఖ వంటి వాటి కోసం ఎన్నో ఏళ్లుగా బీసీలు పోరాటం చేస్తున్నారని చెప్పారు.  బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ చైతన్యం కావాలని అన్నారు. బీసీల న్యాయపరమైన డిమాండ్లను  ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని  ఆయన హామీ ఇచ్చారు.