ఐదేళ్లలో దేశంలో పెట్రోల్‌‌‌‌‌‌‌అవసరం ఉండదు

ఐదేళ్లలో దేశంలో పెట్రోల్‌‌‌‌‌‌‌అవసరం ఉండదు

న్యూఢిల్లీ: ఇంకో ఐదేళ్లలో దేశంలో పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరం ఉండదని కేంద్ర రోడ్డు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌, హైవేస్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్ నితిన్‌‌‌‌‌‌‌‌ గడ్కరీ  అన్నారు. కంప్రెస్డ్‌‌‌‌‌‌‌‌ నేచురల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌ (సీఎన్‌‌‌‌‌‌‌‌జీ), ఇథనాల్‌‌‌‌‌‌‌‌, పైప్డ్ నేచురల్‌‌‌‌‌‌‌‌ గ్యాస్ (ఎల్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌జీ), గ్రీన్ హైడ్రోజన్ వంటి పర్యావరణానికి మేలు చేసే ఇంధనాల  వినియోగం పెరిగితే  పెట్రోల్‌‌‌‌‌‌‌‌ అవసరం లేకుండా పోతుందని  అభిప్రాయపడ్డారు.  మహారాష్ట్రలోని డా. పంజాబ్‌‌‌‌‌‌‌‌రావ్‌‌‌‌‌‌‌‌ దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌ కృషి విద్యాపీఠ్‌‌‌‌‌‌‌‌  నుంచి గౌరవ డాక్టరేట్‌‌‌‌‌‌‌‌ను గడ్కరీ అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రీన్ ఫ్యూయల్స్‌‌‌‌ను వాడడంపై మాట్లాడారు.  ఇంకొన్నేళ్లలో కార్లు, స్కూటర్లు గ్రీన్‌‌‌‌‌‌‌‌ హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌, ఇథనాల్‌‌‌‌‌‌‌‌ కలిపిన ఫ్యూయల్‌‌‌‌‌‌‌‌ (ఇంధనం) , సీఎన్‌‌‌‌‌‌‌‌జీ, పీఎన్‌‌‌‌‌‌‌‌జీ వైపు పూర్తిగా మారిపోతాయని ఆయన అంచనావేశారు.  ‘రానున్న ఐదేళ్లలో దేశం నుంచి పెట్రోల్‌‌‌‌‌‌‌‌ మాయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీతో పాటు అగ్రికల్చర్ సెక్టార్ గురించి కూడా గడ్కరీ మాట్లాడారు. వ్యవసాయ రంగం గ్రోత్‌‌‌‌‌‌‌‌ ప్రస్తుతం ఉన్న 12 % నుంచి  వచ్చే ఐదేళ్లలో 20 శాతానికి పెంచేలా  రీసెర్చర్లు, ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్టులు పనిచేయాలని ఆయన కోరారు. కాగా, ఎలక్ట్రిక్ వెహికల్స్ రేట్లు ఇంకో ఏడాదిలోపు పెట్రోల్‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ రేట్లకు సమానంగా మారతాయని  కిందటి నెల 17 న గడ్కరీ పేర్కొన్న విషయం తెలిసిందే.