ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు ఖాళీగా వెళ్లిన విమానం

ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు ఖాళీగా వెళ్లిన విమానం

మ పైలెట్లకు RTPCR పరీక్ష చేయాల్సిందేనని ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్ అధికారులు స్పష్టం చేయడంతో.. అమెరికాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ఊహించని నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్లను ఎక్కించుకోకుండా ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి న్యూయార్క్‌కు ఆ విమానం ఖాళీగా వెళ్ళిపోయింది. సర్వీసు రద్దు చేసినట్లు ప్యాసింజర్లకు మెసేజ్‌ పెట్టింది. భారత్‌కు సర్వీసులు నిరవధికంగా వాయిదా వేసినట్లు మొదట ప్రకటించినా.. 25వ తేదీ నుంచి మళ్ళీ సర్వీసులు నిర్వహిస్తున్నట్లు యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ స్పష్టం చేసింది.

దగ్గర ప్రాంతాలకు ప్రయాణించే విమానాలు.. ఢిల్లీలో విమానాశ్రయంలో దిగినా.. సిబ్బంది విమానంలోనే ఉంటారు. కాబట్టి సిబ్బందికి కరోనా పరీక్షలు ఉండవు. అయితే యునైటెడ్‌ ఎయిర్‌ లైన్స్‌ సిబ్బంది విమానం దిగి.. ఎయిర్‌పోర్ట్‌లో ఉంటారు.. లేదా నగరంలో ఎక్కడికైనా తిరుగుతారు. దీంతో ఆ విమాన సిబ్బందికి RTPCR పరీక్ష చేయాల్సిందేనని ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ అధికారులు స్పష్టం చేశాయి. దీంతో ఏకంగా ఖాళీ విమానంతో తిరిగి వెళ్ళిపోయారు ఆ విమాన సిబ్బంది.