కడుపులో ఉండే వాయువులు, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయి, ఏమేం సమస్యలు వస్తాయో తెలుసుకోడానికి ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్ సైంటిస్టులు సరికొత్త క్యాప్సుల్‌ను కనుగొన్నారు. ఒకసారి క్యాప్సుల్ వేసుకున్నాక అది శరీరంలోని పేగుల నుంచి పోతున్నాకొద్దీ చుట్టపక్కల గ్యాస్ బయోమార్కర్లను గుర్తించి డేటా సేకరిస్తుంది. బయట ఉన్న పరికరానికి డేటాను పంపిస్తుంది. దాన్ని డాక్టర్లు విశ్లేషిస్తారు. చిన్న, పెద్ద పేగుల్లోని గ్యాస్‌లు ఎలా ఉపయోగపడతాయో చెప్పేందుకు ప్రయోగం చేశామని సైంటిస్టులు తెలిపారు. మన జీర్ణ వ్యవస్థలో ఎక్కువగా ఉండే నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్‌డైఆక్సైడ్, హైడ్రోజన్, మీథేన్‌లకు వాసనే ఉండదని ప్రయోగం ద్వారా కనుగొన్నామన్నారు. నైట్రోజన్ మినహా ఏ గ్యాస్‌లో తేడాలొచ్చినా ఇరిటేటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇన్‌ఫ్లెమెటరీ బౌల్ డిసీసెస్, కొలోన్ క్యాన్సర్ వ్యాధులు వస్తాయన్నారు.

