ఉలాన్‌బాటర్ (మంగోలియా): ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను ఇండియా సానుకూలంగా ప్రారంభించింది. ప్రీతి పవార్, దీపక్ తొలి రౌండ్లలో విజయాలు సాధించి శుభారంభం చేశారు. సోమవారం జరిగిన 54 కేజీల కేటగిరీలో ప్రీతి 5–0తో కజకిస్తాన్ బాక్సర్ ఎలినా బజారోవాను చిత్తు చేసింది.
ఇక ఉత్కంఠగా సాగిన మెన్స్70 కేజీ తొలి రౌండ్‌లో దీపక్ 3-–2 తో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ ఖవాస్‌బెక్ అసదుల్లేవ్‌పై పోరాడి గెలిచాడు.
