రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి.. నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి.. నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 
  •     కలెక్టర్ చంద్రశేఖర్

నల్గొండ, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు రహదారి భద్రత చర్యలను చేపట్టాలని కలెక్టర్ బి .చంద్రశేఖర్ కోరారు. సోమవారం కలెక్టరేట్​లో ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి ఆయన ‘జిల్లా స్థాయి రహదారి భద్రత’ సమావేశాన్ని నిర్వహించారు. 

రోడ్లపై బ్లాక్స్ స్పాట్స్, ఇప్పటివరకు జరిగిన రోడ్డు ప్రమాదాలు, మరణాలు, తీసుకున్న చర్యలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ... ఏప్రిల్ 2న నిర్వహించనున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక గ్రామ, మున్సిపల్ వార్డు సభల ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. 

 హైవేపై ప్రమాదాలు జరిగిన వెంటనే 20 నిమిషాల లోపు పోలీసు లతోపాటు, అధికారులు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎస్పీ శరథ్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. 18 నెలల్లో ఆయా బ్లాక్ స్పాట్ల సంఖ్యను 58 నుండి 38 తగ్గించామని, అలాగే మరణాల సంఖ్య ఏడు శాతానికి తగ్గించగలిగామని తెలిపారు. 

ఏప్రిల్ 1నుండి ఈ ఫైల్స్ అమలు : ఫైళ్ల నిర్వహణలో పారదర్శకత, వేగవంతానికై ఏప్రిల్ 1 నుండి ఈ- ఆఫీసు ఫైల్ పద్ధతిని అమలు చేయనున్నట్లు కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్​లో ఈ- ఆఫీస్ ఫైల్ నిర్వహణను ప్రారంభించారు.

ఫైళ్ల నిర్వహణలో పారదర్శకతతో పాటు, కచ్చితత్వం, వేగవంతం అవసరమని ఈ -ఆఫీసు ద్వారా వీటిని సాధించవచ్చని తెలిపారు. ఏళ్ల తరబడి ఉన్న సమాచారాన్ని ఆన్​లైన్​లో సులభంగా తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు.

ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, దేవరకొండ ఆర్ డి ఓ రమణా రెడ్డి, కలెక్టర్ కార్యాలయ ఏ ఓ మోతిలాల్, ఈ -జిల్లా మేనేజర్ దుర్గారావు పాల్గొన్నారు.