సమంత లీడ్‌గా నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంతకు చెందిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సోమవారం నుంచి డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసినట్టు అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సందర్భంగా ‘మా బంగారం డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టింది’ అని సమంత డబ్బింగ్ చెబుతున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది టీమ్. అలాగే తన ఫేవరెట్ మూవీ కోసం డబ్బింగ్ చెబుతున్నా అని సమంత తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు బలమైన ఎమోషన్స్ ఉంటాయని మేకర్స్ తెలియజేశారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ స్పెషల్‌గా మే 15న వరల్డ్‌వైడ్‌గా సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన సమంత లుక్స్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఓ బేబి’ తర్వాత సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది.
