ఇస్ఫహాన్: ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్గా అమెరికా మంగళవారం తెల్లవారుజామున బంకర్ బస్టర్లతో దాడి చేసింది. శత్రువులు అండర్ గ్రౌండ్లో దాక్కున్నా ఈ బంకర్ బస్టర్లు తుదముట్టించేస్తాయి. పెద్ద పెద్ద రాళ్లు అడ్డుపడినా పేల్చుకుంటూ పోవడమే ఈ బంకర్ బ్లాస్టర్ బాంబుల ప్రత్యేకత.
ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌లో ఈ భారీ పేలుళ్లకు సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. అణుకేంద్రాలకు పెట్టింది పేరైన ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంపై అమెరికా ఈ బాంబులతో విరుచుకుపడటంతో యుద్ధం మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ పేలుళ్ల ధాటికి ఇస్ఫహాన్ సిటీలో ఆకాశం బద్ధలైన అగ్ని పర్వతంలా మంటలతో నిండిపోయి కనిపించింది. ట్రంప్ ఈ వీడియో పోస్ట్ చేసినప్పటికీ ఇస్ఫహాన్ నగరంలో ఈ పేలుళ్లు జరిగాయని స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. ట్రంప్ చెప్పకపోయినప్పటికీ ఇస్ఫహాన్‌పై ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు.. అమెరికా, ఇజ్రాయెల్ ఇస్ఫహాన్పై సంయుక్తంగా జరిపిన దాడుల దృశ్యాలేనని అంతర్జాతీయ మీడియా ఛానల్స్ రిపోర్ట్ చేశాయి.
ఇస్ఫహాన్ నగరంలో దాదాపు 23 లక్షల జనాభా నివసిస్తున్నారు.'బదర్' సైనిక విమానశ్రయం ఇస్ఫహాన్లోనే ఉంది. ఇరాన్ ఈ దాడులకు కౌంటర్ అటాక్స్ చేసే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయని అంతర్జాతీయ మీడియా చెప్పుకొచ్చింది.
🚨 BREAKING: President Trump just posted a video of MASSIVE explosions in Isfahan, Iran following what’s believed to be U.S.-Israeli airstrikes
— Nick Sortor (@nicksortor) March 31, 2026
We clearly hit something pretty big… pic.twitter.com/3rg7aGkeEF
