ఉమ్మడి వరంగల్‍ చుట్టూ.. రెండు కొత్త సినిమాలు

ఉమ్మడి వరంగల్‍ చుట్టూ.. రెండు కొత్త సినిమాలు
  • రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా..విరాటపర్వం.. నక్సలిజం
  • ఓరుగల్లు అభిమానుల్లో ఆసక్తి.. ఉత్కంఠ

వరంగల్‍, వెలుగు: శుక్రవారం రిలీజ్​ కాబోతున్న విరాటపర్వం, ఈ నెల 23న విడుదల కానున్న ‘కొండా’  మూవీస్ పై ఓరుగల్లు జనాల్లో​అమితాసక్తి నెలకొంది.  వరంగల్‍కు చెందిన కాంగ్రెస్‍ నేతలు కొండా సురేఖ, మురళి దంపతుల నిజ జీవితం ఆధారంగా ‘కొండా’ బయోపిక్‍ నిర్మించినట్లు డైరెక్టర్​ రాంగోపాల్​వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఇదే జిల్లాకు చెందిన తూము సరళ జీవితం నేపథ్యంతో ‘విరాటపర్వం’ మూవీ తెరకెక్కించినట్లు జిల్లాకు చెందిన దర్శకుడు ఊడుగుల వేణు తెలిపారు.

వారం తేడాతో  ఓరుగల్లుకు చెందిన వ్యక్తుల రియల్‍ లైఫ్‍ ఆధారంగా రూపొందించిన రెండు సినిమాలు రిలీజ్‍ కాబోతుండడం విశేషం. కాగా, ‘కొండా’ రాజకీయ అంశాలకు దగ్గరగా ఉండగా, విరాటపర్వం నక్సలిజం, ప్రేమ ఇతివృత్తంగా సాగనున్నాయి. మొత్తంగా రెండు సినిమాలు ఉమ్మడి వరంగల్‍ చుట్టురా తిరగుతుండడం, రెగ్యులర్‍ సినిమాలకు భిన్నంగా తీసినవి కావడంతో ఓరుగల్లు అభిమానుల్లో ఒకింత ఆసక్తి, ఉత్కంఠ రేపుతున్నాయి. రియల్‍ క్యారెక్టర్ల ఆధారంగా బయోపిక్‍ సినిమాలు తీసినట్లు డైరెక్టర్లు చెబుతున్నా.. మూవీలో వారి జీవిత విశేషాలను ఉన్నవి ఉన్నట్లు చూపుతారా.? కల్పితాలతో ముందుకు నడిపించారా? అన్నది తెర మీద చూడాల్సిందే.