మూడు పెళ్లిళ్లు నేనేం ప్లాన్ చేసి చేసుకోలె: పవన్ కళ్యాణ్

మూడు పెళ్లిళ్లు నేనేం ప్లాన్ చేసి చేసుకోలె: పవన్ కళ్యాణ్

బాలయ్య అన్ స్టాపబుల్ షోలో తన మూడు పెళ్లిళ్లపై  పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.  తానేమి వ్యామోహంతో  మూడు  పెళ్లిళ్లు చేసుకోలేదని చెప్పారు. అసలు తాను బ్రహ్మచారిగా ఉండాలనుకున్నా అని చెప్పారు.   కానీ  అసలు జరిగింది తలుచుకుంటే అసలు తనకేనా  మూడు పెళ్లి జరిగిందని  అనిపిస్తుందని అన్నారు. తానేమి ప్లాన్  చేయలేదని..  రిలేషన్ షిప్ లో కొన్ని కుదరవు కాబట్టి విడిపోవాల్సి వస్తుందన్నారు. రెండోసారి అభిప్రాయభేదాలు వచ్చాయని చెప్పారు.  ప్రతి సారి మూడు పెళ్లిళ్లు అంటుంటే  ముగ్గురిని ఒకేసారి చేసుకోలేదు కదా అని చెప్పాలనిపిస్తుందన్నారు. రాజకీయాల్లో ఉన్నా కాబట్టి విమర్శించేందుకు తన పెళ్లిళ్లు ఒక ఆయుధంలా  మారిందన్నారు.