‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ సీజన్ 4 మొదటి ఎపిసోడ్‌కి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఈ షో ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో సీజన్‌లో అడుగుపెట్టింది.
ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ షూట్ కోసం ఆదివారం చంద్రబాబు అన్‌స్టాపబుల్ సెట్‌కి వచ్చారు. ఈ ఎపిసోడ్‌లో చంద్రబాబు, బాలకృష్ణ మధ్య జరిగిన సంభాషణల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎక్సయిటింగ్ ఎపిసోడ్ అక్టోబరు 25న ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.