
యూపీలో ఎన్నికల వాతావరణం మొదలైంది. బీజేపీ, ఎస్పీ మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఎస్పీ అధికార ప్రతినిధి రాజీవ్ రాయ్, సెక్రటరీ జైనేంద్ర యాదవ్ పలువురు పార్టీ నేతల ఇండ్లల్లో ఐటీ వరుస సోదాలు నిర్వహించడంపై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ దాడులు బీజేపీ ఎన్నికల్లో ఓడిపోవడానికి నిదర్శనమన్నారు. తమ పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని.. ప్రతిరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రికార్డింగ్ లు వింటారని ఆరోపించారు. తమ పార్టీ నేతలందరిపై నిఘా పెట్టారన్నారు. రాజకీయనేతలే కాకుండా జర్నలిస్టులు కూడా ప్రభుత్వ నిఘాలో ఉన్నారని అక్కడి మీడియానుద్దేశించి అన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఉద్దేశించి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ "యుపి+యోగి ఉపయోగి, అంటే ఉపయోగకరమైనది" అని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. యూపీ+యోగి ఉపయోగి కాదు unupyogi (పనికిరానిది) యూస్ లెస్ అంటూ విమర్శించారు.