కాకతీయుల శిల్పాకళా సంపద అద్భుతం..వరంగల్ పర్యటనలో యూపీ, పంజాబ్ ఎలక్ట్రిసిటీ కమిషన్ల చైర్మన్లు

కాకతీయుల శిల్పాకళా సంపద అద్భుతం..వరంగల్ పర్యటనలో యూపీ, పంజాబ్ ఎలక్ట్రిసిటీ కమిషన్ల చైర్మన్లు

గ్రేటర్​ వరంగల్/ హనుమకొండ సిటీ, వెలుగు: కాకతీయుల వాస్తు శిల్పకళా అద్భుతంగా ఉందని యూపీ, పంజాబ్  ఎలక్ర్టిసిటీ రెగ్యులేటరీ కమిషన్ల చైర్మన్లు అరవింద్​కుమార్, విశ్వజిత్​ఖన్నా పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా గురువారం తమ కుటుంబసభ్యులతో కలిసి​వేయి స్థంభాల గుడి, భద్రకాళి భవాని మాత ఆలయాన్ని దర్శించుకున్నారు. కాకతీయుల శిల్పకళా సంపదను చూడడం చాలా సంతోషంగా పేర్కొన్నారు.

 అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఓరుగల్లు కోటలోని కాకతీయ కీర్తితోరణాలు, ఏకశిల గుట్ట, గుండు చెరువు, ఖుష్ మహల్ ను సందర్శించారు. స్వయం భూ శివాలయంలో పంచామృతాభిషేకాలు చేశారు. గైడ్ సూర్య కిరణ్ కాకతీయుల చరిత్రను చెప్పారు.  ఎంతో ఘన చరిత ఉన్న వరంగల్ ను సందర్శించడం  సంతోషంగా ఉందన్నారు.  కాకతీయులు నిర్మించిన  కట్టడాల్లో కోటలు, సరస్సులు, దేవాలయాలు, రాతి ద్వారాలు పర్యాటక ఆకర్షణగా ఉన్నాయని కొనియాడారు.

  అంతకుముందు హరిత కాకతీయ హోటల్​లో వీరిని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్, వరంగల్ కలెక్టర్ సత్య శారదా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయి బొకే అందించి స్వాగతించారు. వారి వెంట డైరెక్టర్లు వి . మోహన్ రావు,టి. మధుసూదన్, సి . ప్రభాకర్, హన్మకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, వరంగల్ ఎస్ఈ కె . గౌతమ్ రెడ్డి, ఈలు సాంబరెడ్డి, మల్లికార్జున్, భాస్కర్, ఏడీఈ  పి.మల్లికార్జున్ ఉన్నారు.