యూపీ వరద ప్రాంతాల్లో సీఎం యోగి ఏరియల్ సర్వే

యూపీ వరద ప్రాంతాల్లో సీఎం యోగి ఏరియల్ సర్వే

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటించారు. బలరాంపూర్  ప్రాంతంలో నిన్న ఏరియల్ సర్వే నిర్వహించిన యోగి.. ఇవాళ బస్తీ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే జరిపారు. ఆ తర్వాత సిద్ధార్థనగర్ లో వరదలపై అధికారులతో సమీక్షించారు. వరద బాధితులకు నిత్యావసరాలు అందించారు.

వరదల వల్ల ఇల్లు, వాకిలి నీట మునిగిన బాధితులు, రైతులతో సీఎం యోగి ఇంటరాక్ట్ అయ్యారు.  వరద బాధితులకు అండగా నిలిచి ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. 

అయోధ్యలో డేంజర్ లెవల్ దాటి ప్రవహిస్తున్న సరయూ నది

అయోధ్యలో సరయూ నది డేంజర్ లెవల్ ను దాటి ప్రవహిస్తోంది. స్నాన ఘట్టాలు నీట మునిగాయి. నదీ తీర ప్రాంతంలోని ఆలయాలు, ఇండ్లు వరదలో మునిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో వరద ముంచెత్తిందని అధికారులు చెబుతున్నారు. 2009 వరదల కంటే మించిన వరద వచ్చిందని అంటున్నారు. సరయూ నది ఎగువన నది పరివాహక  ప్రాంతంలో కురిసిన వర్షాలతోపాటు.. నేపాల్ లో కురుస్తున్న వర్షాలతో సరయూ నదికి వరద పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. సరయు నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నందున ప్రజలు ఎవరూ నదీ తీరంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు.