రాష్ట్రంలో నిరంకుశ పాలనకు ముగింపు పలకండి

రాష్ట్రంలో నిరంకుశ పాలనకు ముగింపు పలకండి

ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో తెలంగాణలోనూ కమలం వికసిస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగుతున్న నిరంకుశ పాలనకు ముగింపు పలకడంతో పాటు బీజేపీపై జరుగుతున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. యూపీలో డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల సుపరిపాలన సాగుతోందని, కేంద్ర పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయని చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ లో 6 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల హెల్త్ కవరేజీ అందించడంతో పాటు కరోనా కారణంగా గత 28 నెలలుగా 15 కోట్ల మందికి నెలకు రెండుసార్లు ఫ్రీ రేషన్ అందిస్తున్నట్లు యోగి ప్రకటించారు. 

మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు వల్లే యూపీ సుపరిపాలన సాగుతోందని, అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని యోగి చెప్పారు. మాఫియాపై ఉక్కుపాదం మోపడంతో పాటు ప్రభుత్వ ఖజానాను లూటీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తెలంగాణలో బీజేపీ సర్కారు ఏర్పడితే రాష్ట్రాభివృద్ధికి తమ వంతు సాయం అందిస్తామని యోగి హామీ ఇచ్చారు.