
ఉత్తర్ ప్రదేశ్ లో 16 ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అందులో హాత్రాస్ 19 ఏళ్ల బాధితురాలి కేసును విచారిస్తున్న మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ లక్ష్కర్.., మిర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ కు బదిలీ అయ్యారు. ప్రవీణ్ కుమార్ లక్ష్కర్ స్థానంలో ఉత్తర ప్రదేశ్ కార్పొరేషన్ అడిషనల్ ఎండీగా ఉన్న ఎండీ రమేష్ రాజన్ ఛార్జ్ తీసుకోనున్నారు.
సెప్టెంబర్ 14న 19 ఏళ్ల దళిత యువతిపై నలుగురు ఉన్నత వర్గానికి చెందిన యువకులు అత్యాచారం చేశారు. ఆపై తమపేరు ఎక్కడ చెబుతుందోనని ఆమె నాలుక కోశారు. వెన్నుపూస విరిచేశారు. ఈ ఉదంతంలో బాధితురాలు సెప్టెంబర్ 29న సప్దర్ గంజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో అధికారులు ఆమె మృతదేహాన్ని సప్దర్ గంజ్ ఆస్పత్రి నుంచి అంబులెన్స్ లో తరలించి అర్ధరాత్రి రహస్యంగా దహన సంస్కరాలు నిర్వహించారు.
ఓవైపు కుమార్తె మృతదేహాన్ని తమకు చూపించాలని, ఆచారం ప్రకారం అర్ధరాత్రి దహన సహకారం చేయకూడదని ప్రాదేయపడ్డారు. కానీ స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో హాత్రాస్ జిల్లా మేజిస్ట్రేట్ లక్ష్కర్ ఆదేశాలతో బాధితురాలి డెడ్ బాడీకి అర్ధరాత్రి దహన సంస్కారాలు నిర్వహించారు. బాధితురాలి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించకుండా దహన సంస్కారాలు ఎందుకు నిర్వహించారంటూ దేశప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అలహదాబాద్ హైకోర్ట్ విచారణ చేపట్టింది. అర్ధరాత్రి బాధితురాలి మృతదేహానికి దహన సంస్కారాలు ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలని సూచించింది. విచారణ సందర్భంగా కోర్ట్ కు హాజరైన లక్ష్కర్.., శాంతి భద్రతల్ని కాపాడేందుకు మృతదేహానికి అర్ధరాత్రి దహన సంస్కారాలు నిర్వహించినట్లు కోర్ట్ కు తెలిపారు.
కేసు విచారణ జరిగే సమయంలో జిల్లా మేజిస్ట్రేట్ లక్ష్కర్ బాధితురాలి తండ్రిని బెదిరించారు. యువతి మరణంపై ఇచ్చిన స్టేట్మెంట్ మార్చాలని, మీడియా రెండు మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. మేం మాత్రమే మీకు అండగా ఉంటాం. ఇక మీ ఇష్టం. మీరు ఇచ్చిన ఫిర్యాదు స్టేట్మెంట్ ను మార్చడం అనేది మీ చేతుల్లో ఉందంటూ బాధితురాలి తల్లి,దండ్రులతో సంభాషించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసిన హాత్రస్ జిల్లా మేజిస్ట్రేట్ కోర్ట్ జడ్జ్ గా ఉన్న ప్రవీణ్ కుమార్ లక్ష్కర్ బదిలీ అయ్యారు.