
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. బాబేరు ప్రాంతంలోని భాటి అనే గ్రామంలో ఓ యువకుడు తన నాలుకను కోసుకున్నాడు. ఆదివారం ఆలయానికి వచ్చిన ఆత్మారాం(22) అనే ఏళ్ల యువకుడు తన నాలుకను కత్తిరించి దేవుడికి నైవేద్యంగా అర్పించాడని పోలీసులు చెప్పారు. నాలుక తెగడంతో తీవ్ర రక్తస్రావమైన అతన్ని ఆసుపత్రికి తరలించామని, అతని పరిస్థితి స్థిరంగా ఉందని పోలీసులు చెప్పారు.
అయితే తన కుమారుడికి మతిస్థిమితం సరిగా లేదని, నవరాత్రి సందర్భంగా నాలుక కోసుకున్నాడని ఆత్మారాం తండ్రి చెప్పారు. మరో ఘటనలో యూపీలోని కురారా ప్రాంతంలోని శివాలయంలో 49 ఏళ్ల రుక్మిణి మిశ్రా కోకేశ్వర్ అనే వ్యక్తి ఆలయంలో కత్తితో గొంతు కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. మూఢనమ్మకాల వల్లనే వీరిద్దరూ ఈ చర్యకు పాల్పడ్డారని జిల్లా ఎస్పీ చెప్పారు.