సలహ అడిగిన విద్యార్ధినికి ప్రొఫెసర్ పంపిన మెసేజ్ ఇది

సలహ అడిగిన విద్యార్ధినికి  ప్రొఫెసర్ పంపిన మెసేజ్ ఇది

యూపీ: ‘నువ్వు చాలా అందంగా ఉంటావ్. నీ ముక్కు అందర్నీ ఆకర్షించేలా చాలా బాగుంటుంది. నీలాంటి అందమైన అమ్మాయి స్నేహాన్ని ఎవరు మాత్రం వద్దని అనుకుంటారు? కాకపోతే నువ్వు కొంచెం ఫ్యాట్. డీపీ (డిస్ప్లే పిక్)లో నీ పిక్ చేంజ్ చేయొచ్చు కదా..’ ఇది ఓ యూనివర్శిటీ ప్రొఫెసర్.. ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ కి వాట్సాప్ లో పంపిన చాట్.

యూపీలోని మీరట్ లో చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీకి చెందిన ఓ ప్రొఫెసర్.. ఎం.ఫిల్ ప్రవేశ పరీక్షకు ఎలా సన్నద్ధమవ్వాలని  సలహా అడిగిన విద్యార్ధినికి వాట్సాప్ లో అభ్యంతరకర మెసేజ్ లు పంపాడు. ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏ ఏ బుక్స్ చదవాలని ఆమె అడగ్గా.. యూనివర్శిటీలో అడ్మిషన్ నీకు ఈజీగా వస్తుందని చెప్పాడు.

ఈ వాట్సాప్ చాట్ కాస్త బయటికి రావడంతో… చాట్ చేసిన ప్రొఫెసర్ డీపీ ద్వారా అతను సీసీఎస్ యూనివర్శిటీకి చెందిన వాడిగా ధ్రువీకరించారు. యూనివర్శిటీలో సులభంగా అడ్మిషన్ లు ఇప్పిస్తామంటూ  యూనివర్శిటీ ప్రొఫెసర్స్.. స్టూడెంట్స్ తో  ఇలా సరసాలాడుతున్నారా అని పలువురు మండిపడుతున్నారు. ఈ విషయం మీరట్ జిల్లా మేజిస్ట్రేట్ కె. బాలాజీ తెలియడంతో ఏడు రోజుల్లో సిసిఎస్ యూనివర్శిటీ ఈ వాట్సాప్ చాట్ పై స్పందిచాలని ఆదేశించారు. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ ప్రవర్తన సిగ్గుచేటు అని తెలిపారు.