- గుజరాత్‌పై యూపీ విజయం
- రాణించిన అలీసా హాలీ, ఎకెల్‌స్టోన్
బెంగళూరు: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఛేజింగ్‌లో గ్రేసీ హారిస్ (33 బాల్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 నాటౌట్) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో యూపీ 6 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై నెగ్గింది.
టాస్ ఓడిన గుజరాత్ 20 ఓవర్లలో 142/5 స్కోరు చేసింది. ఫోబీ లిచ్‌ఫీల్డ్ (35), ఆష్లే గార్డెనర్ (30) రాణించారు. ఓపెనర్లు లారా వోల్‌వర్ట్ (28), బెత్ మూనీ (16) తొలి వికెట్‌కు 40 రన్స్ జత చేసి శుభారంభాన్నిచ్చారు. అయితే ఆరో ఓవర్‌లో మూనీ ఔట్ కావడంతో పవర్‌ప్లేలో గుజరాత్ 41/1 స్కోరే చేసింది. హర్లీన్ డియోల్ (18) వేగంగా ఆడుతూ వోల్‌వర్ట్‌తో రెండో వికెట్‌కు 21 రన్స్ జోడించింది.
అయితే మూడు ఓవర్ల వ్యవధిలో ఈ ఇద్దరూ ఔట్‌కావడంతో గుజరాత్ 83/3 స్కోరుతో నిలిచింది. ఈ దశలో లిచ్‌ఫీల్డ్, గార్డ్‌నర్.. గుజరాత్ బౌలింగ్‌ను దంచికొట్టారు. వరుసగా బౌండ్రీలు బాదుతూ రన్‌రేట్ పెంచారు. అయితే 19వ ఓవర్‌లో నాలుగు బాల్స్ తేడాలో వీరిద్దరూ ఔట్‌కావడంతో నాలుగో వికెట్‌కు 52 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. చివర్లో హేమలత (2 నాటౌట్), కేథరిన్ బ్రైస్ (5 నాటౌట్) ఓ మాదిరిగా ఆడటంతో గుజరాత్ సాధారణ టార్గెట్‌నే నిర్దేశించింది.
ఎకిల్‌స్టోన్ 3, రాజేశ్వరి ఒక్క వికెట్ తీసింది. తర్వాత యూపీ 15.4 ఓవర్లలో 143/4 స్కోరు చేసి గెలిచింది. అలీసా హీలీ (33) రాణించింది. కిరణ్ నవ్‌గిరె (12), చామిరి ఆటపట్టు (17), దీప్తి శర్మ (17 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. గుజరాత్‌కు హ్యాట్రిక్ ఓటమి కావడం గమనార్హం. హారిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
