
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై ఆయన సతీమణి ఉపాసన ప్రతీకారం తీర్చుకుంది. చరణ్ పై ఆమె రివేంజ్ ఆమె రివేంజ్ తీర్చుకోవడమేంటని షాకవుతున్నారా.. అదంతా ఓ నెటిజన్ సరదాగా తన క్రియేటివిటీతో క్రియేట్ చేసిన ఓ వీడియో. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫన్నీ వీడియో ఉపాసనకు కూడా నచ్చేయడంతో.. ఆమె దాన్ని ఇన్‌స్టాలో షేర్ చేశారు. కొన్ని నెలల క్రితం అల్లు రామలింగయ్య శతజయంతి వేడుక కార్యక్రమంలో రామ్ చరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్‌లు పాల్గొన్నారు. ఆ సమయంలో వీరు ముగ్గురూ ఒకే సోఫాలో కూర్చున్నారు. అయితే సోఫా ఇరుగ్గా ఉండటంతో చరణ్ ఉపాసనను పక్క సీటులో కూర్చోమని చెప్పారు. ఆమెను అలా ఆటపట్టించినందుకు చరణ్.. సాయిధరమ్ తేజ్ లు తెగ నవ్వుకున్నారు. అప్పట్లో ఆ వీడియో బాగా వైరల్ అయింది.
అయితే, ఈ సీన్ తర్వాత చరణ్ ఇంటికి వెళ్లాక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో సరదాగా చెప్పాలనుకున్నాడు ఓ మీమర్. ఇందులో ఉపాసన చరణ్‌తో ఇంటి పనులన్నీ చేయించినట్టు చూపించారు. చెట్లకు నీళ్లు పోయడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, స్వయంగా కాఫీ కలిపి ఉపాసనకు ఇవ్వడం తదితర సీన్లన్నీ చూపించి.. అమ్మాయిలతో వ్యవహారం ఇలా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియో నచ్చడంతో నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం ఈ మెగా హీరో శంకర్ దర్శకత్వంలో రాబోతోన్న ఆర్‌సీ15 లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ విశాఖలో జరుగుతుంది.