పైసా ఖర్చు లేకుండా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోండి.. జూన్‌ 14 వరకే గడువు

పైసా ఖర్చు లేకుండా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోండి..  జూన్‌ 14 వరకే గడువు

ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఆ అవకాశం కొద్దిరోజులు మాత్రమే మీకుంది. ఆధార్ ప్రాధికార సంస్థ యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రస్తుతం ఆధార్ కార్డులో వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగానే అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.  దీనికి జూన్ 14 వరకే గడువును విధించింది.

ఈ గడువు దాటితే మళ్లీ యథావిథిగానే చార్జీలు వసూలు చేస్తారు.  సాధారణంగా ఆధార్ వివరాల అప్‌డేట్‌కు రూ. 50 ఖర్చు అవుతుంది. అయితే జూన్ 14 వరకు చూస్తే.. డమొగ్రాఫిక్ వివరాలను అప్‌డేట్ అనేది పూర్తిగా ఉచితం. మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లి ఉచితంగా ఆధార్ కార్డులో వివరాలు మార్చుకోవచ్చు. మైఆధార్ పోర్టల్‌లో మాత్రమే ఈ సేవలు ఉచితం. ఒకవేళ మీరు ఆధార్ సెంటర్‌కు వెళ్లి వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం కచ్చితంగా చార్జీలు పడతాయి. 

అప్‌డేట్‌ చేసుకోండిలా

  • myaadhaar.uidai.gov.in పోర్టల్‌ ఓపెన్‌ చేసి ఫోన్‌ నంబర్‌ నమోదు చేశాక వచ్చే ఓటీపీతో లాగిన్‌ అవ్వాలి
  • ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను నిక్షిప్తం చేసేందుకు డాక్యుమెంట్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి
  • ఇందులో పేరు, ఇతర వివరాలను రుజువు చేస్తూ తగిన ధ్రువపత్రాలు ఆప్‌లోడ్‌ చేయాలి
  • అనంతరం చిరునామా నిరూపించేలా మరో ప్రతాన్ని అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ చేయాలి
  • వెంటనే ఆధార్‌ అప్‌డేట్‌ పూర్తయినట్లు ఫోన్‌ నంబర్‌కు మేసేజ్‌ వస్తుంది
  • ఆధార్‌ అప్‌డేట్‌ కోసం మీ సేవ కేంద్రాల్లో రుసుం వసూలుపై నిబంధనలు జారీ చేశారు
  • బయోమెట్రిక్‌ అప్‌డేట్‌కు రూ.100, డెమోగ్రాఫిక్‌ అప్‌డేట్‌కు రూ.50, ఆధార్‌ డౌన్‌లోడ్‌, కలర్‌ ప్రింట్‌కు రూ.30 చెల్లించాలి
  • ఇందులో ఏమైనా సమస్యలు తలెత్తితే టోల్‌ ఫ్రీ 1947 నంబర్‌ను సంప్రదించవచ్చు.


ఆధార్‌ పొంది పదేండ్లు పూర్తయిన ప్రతి ఒక్కరూ కార్డును అప్‌డేట్‌ చేసుకోవాలి. బ్యాంకులు, శాశ్వత ఆధార్‌ కేంద్రాల్లో తగిన డాక్యుమెంట్లు అందజేసి నవీకరణ చేసుకోవచ్చు. స్వతహాగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకునే అవకాశం ఉన్నది. ప్రతి వ్యవహారానికి ఆధార్‌ ప్రామాణికంగా మారింది. కావునా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జూన్‌ 14 వరకు తప్పనిసరిగా ఆధార్‌కార్డు అప్‌డేట్‌ చేసుకోవాలి