UPIతో మొబైల్ నుంచే విదేశాల్లోనూ చెల్లింపులు..

UPIతో మొబైల్ నుంచే విదేశాల్లోనూ చెల్లింపులు..

యూపీఐ (Unified Payments Interface)తో ఇన్నాళ్లు భారతదేశంలోనే పేమెంట్స్ చేసిన ప్రజలకు గుడ్ న్యూస్. ఇక నుంచి యూపీఐతో విదేశాల్లోనూ పేమెంట్స్ చేయొచ్చు. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ (NPCI) అనుబంధ సంస్థ అయిన NPCI ఇంటర్నేషనల్‌ పేమెంట్స్, AI ఎతిహాద్‌ పేమెంట్స్‌తో ఒప్పందం చేసుకుంది.  అబుదాబిలో పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధులు ఈ ఒప్పందంపై  సంతకాలు చేశారు.

AI ఎతిహాద్‌ పేమెంట్స్‌  అనేది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ UAE  యొక్క  అనుబంధ సంస్థ.  యూఏఈలో  NIPL ఇంటర్నేషనల్ పేమెంట్స్, AI ఎతిహాద్‌ పేమెంట్స్‌ UAE జాతీయ దేశీయ కార్డ్ స్కీమ్‌ను అమలు చేయడానికి కలిసి పనిచేస్తాయి. అక్కడ పర్యటించే భారతీయులు కూడా యూపీఐ పేమెంట్స్ ద్వారా పే చేయొచ్చు.

AI ఎతిహాద్‌ పేమెంట్స్‌ తో  NIPL ఇంటర్నేషనల్ పేమెంట్స్ చేసుకున్న ఒప్పందం ద్వారా  యుఎఇలో ఇ-కామర్స్,యు డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతాయి. ఆ దేశంలో డిజిటలైజేషన్ పెరుగుతుంది.క్యాష్ పేమెంట్స్ కాకుండా ప్రత్యామ్నాయ చెల్లింపు ఎంపికలను పెంచుతుంది. అంతేకాదు  చెల్లింపుల వ్యయాన్ని తగ్గిస్తుంది.